తెలంగాణ

telangana

ETV Bharat / state

మాస్కులు లేకుండానే రోడ్లపైకి.. కరోనా నిబంధనలు గాలికి.. - తెలంగాణలో కొవిడ్​ కేసులు

కరోనా మహమ్మారి రాష్ట్రంలో పంజా విరుసుతున్నా ప్రజలు అసత్వాన్ని మాత్రం వీడటంలేదు. పలుచోట్లు గుంపులుగుంపులుగా తిరుగుతూ.... నిబంధనలను గాలికొదిలేస్తున్నారు. మాస్కుల వినియోగం, భౌతిక దూరం తప్పనిసరంటూ వైద్యాధికారులు పదేపదే చెబుతున్నా... పట్టించుకోవటంలేదు. ఫలితంగా కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు అంతకంతకూ పెరిగిపోతోంది.

gudimalkapur flower market
people not wear mask

By

Published : Apr 11, 2021, 12:58 PM IST

కరోనా సెంకడ్ వేవ్ వేగంగా వ్యాపిస్తోంది. jోజురోజుకూ ఉగ్రరూపం దాల్చుతోంది. మరోవైపు ప్రజల్లో కరోనా నిబంధనల పట్ల అలసత్వం వైరస్ వ్యాప్తికి కారణం అవుతోంది. ప్రభుత్వాలు, వైద్యులు మాస్కుల వినియోగాన్ని వివరిస్తున్నా పట్టించుకునే వారే కరవయ్యారు. ఫైన్​లు విధిస్తున్నా నిబంధనలు పెడచెవిన పెడుతున్నారు.

మాస్కు వేసుకోని మార్కెట్లు... కొవిడ్​ వ్యాప్తికి సింహ ద్వారాలు

కొన్ని ప్రదేశాల్లో గుంపులు గుంపులుగా తిరుగుతూ.. ఇంకా కరోనా ఉందా..! మాస్క్​ వేసుకోవాలా..? అనుకునే వారు కొందరైతే.. మాస్క్​ ముఖానికి తగిలిస్తే సరిపోతుంది.. ముక్కుకు వేసుకోవాలా ఏంటి అనేవారు ఇంకొందరు... ఈ పరిస్థితి కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది నిత్యం రద్ధీగా ఉండే గుడిమాల్కాపూర్ పూల మార్కెట్​. అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే..

ఇదీ చూడండి:కరోనా అలర్ట్: రాష్ట్రంలో కొత్తగా మరో 3187 కొవిడ్ కేసులు

ABOUT THE AUTHOR

...view details