హైదరాబాద్, సురారం కాలనీలో.. ప్రభుత్వం అందిస్తోన్న ఉచిత బియ్యం కోసం ప్రజలు రేషన్ దుకాణాలకు(Ration shops) పోటెత్తారు. కొరత ఏర్పడుతుందేమోననే భయంతో కరోనా నిబంధనలను గాలికొదిలేసి కేంద్రాల వద్ద బారులు తీరారు. ఇది గమనించిన సామాజిక కార్యకర్త రవీందర్.. మహమ్మారిపై వారికి అవగాహన కల్పిస్తూనే దుకాణాల ఎదుట భౌతిక దూరం(Physical distance) పాటించేలా కృషి చేస్తున్నారు.
Ration shop Q line: భౌతిక దూరం కోసం గొడుగు మంత్రం - physical distance at ration shops
రేషన్ దుకాణాల(Ration shops) వద్ద జనాలు బారులు తీరుతున్నారు. సన్నబియ్యం నిల్వలు అయిపోతే దొడ్డు బియ్యం ఇస్తారనే భయంతో కరోనా నిబంధనలు సైతం పాటించకుండా షాపులకు ఎగబడుతున్నారు. ఇది గమనించిన ఓ సామాజిక కార్యకర్త.. మహమ్మారిపై అవగాహన కల్పిస్తూనే దుకాణాల ఎదుట భౌతిక దూరం పాటించేలా కృషి చేస్తున్నారు.
Crowd at ration shops
రవీందర్.. క్యూలైల్లో ఉన్న ప్రజలకు గొడుగులు అందజేసి సామాజిక దూరం పాటించాల్సిందిగా సూచిస్తున్నారు. కరోనా మహమ్మారి పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి:ప్రేమ రిజెక్ట్ చేసిందని.. 22 సార్లు అతి దారుణంగా...