తెలంగాణ

telangana

ETV Bharat / state

సిబ్బంది నిర్లక్ష్యంతో.. వ్యాక్సిన్ కేంద్రాల్లో అవస్థలు - వ్యాక్సిన్ కొరత

రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ హడలెత్తిస్తోంది. రోజురోజుకూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. వ్యాధి నిర్ధరణ పరీక్షలు, నిరోధక టీకాల కోసం ఆసుపత్రుల వద్ద జనాలు బారులు తీరుతున్నారు. ఓ వైపు ఆరోగ్య కేంద్రాల్లో డిమాండ్​కు తగ్గ వసతులు లేక.. సిబ్బంది నిర్లక్ష్యం మరో కారణంగా వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Confusion at vaccine centers
Confusion at vaccine centers

By

Published : Apr 30, 2021, 3:58 PM IST

గ్రేటర్ హైదరాబాద్​లోని పలు ఆరోగ్య కేంద్రాల్లో.. సిబ్బంది నిర్లక్ష్యం ప్రజలను వేధిస్తోంది. ముషీరాబాద్, భోలక్ పూర్, కవాడిగూడ కేంద్రాల్లో.. వేర్వేరుగా టోకెన్ నంబర్లు ఇస్తూ సిబ్బంది తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాక్సిన్​ కోసం పెద్ద ఎత్తున వచ్చిన ప్రజలు కేంద్రం ఎదుట ఆందోళన చేయడంతో.. వైద్య సిబ్బంది పోలీసులకు సమాచారం అందజేశారు. కేంద్రానికి చేరుకున్న పోలీసులు.. ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

ఉదయం 7 గంటలకు టోకెన్లు ఇచ్చి.. మళ్లీ 10 గంటలకు మరోసారి టోకెన్లు ఇస్తూ తమను అయోమయానికి గురి చేస్తున్నారంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రాల వద్ద అవస్థలు పడుతోన్న వృద్ధులను చూసైనా.. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:రాష్ట్రంలో కరోనా కిట్ల కొరత.. భవిష్యత్తులో టెస్టులు సందేహమే.!

ABOUT THE AUTHOR

...view details