తెలంగాణ

telangana

ETV Bharat / state

అన్నీ మూలకు పడ్డాయ్.. 'రిపేరు' చేసేదెవరు..?

లాక్‌డౌన్‌తో అన్ని రకాల సేవలు బంద్‌ కావడం వల్ల ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా వివిధ రకాల సర్వీసింగ్‌ సెంటర్లు లేకపోవడంతో సెల్‌ఫోన్ల నుంచి ఇంట్లోని గృహోపకరణాలు, ద్విచక్ర వాహనాలు, కార్లు సైతం మూలకు పడుతున్నాయి.

By

Published : May 12, 2020, 10:06 AM IST

Hyderabad district latest news
Hyderabad district latest news

కరోనా నేపథ్యంలో అన్ని దుకాణాలు, షాపింగ్‌ మాల్స్‌, సర్వీసు కేంద్రాలు మూత పడిన సంగతి తెలిసిందే. చివరికి చేతి గడియారం ఆగిపోయినా...బ్యాటరీ మార్చే దిక్కు లేకుండా పోయింది. ఈ నెల 29 వరకు లాక్‌డౌన్‌ పొడిగించడం వల్ల మరిన్ని తిప్పలు తప్పేలా లేవని నగరవాసులు వాపోతున్నారు. కనీసం ఇలాంటి అత్యవసర షాపులు తెరిచేందుకు సడలింపులు ఇవ్వాలని కోరుతున్నారు.

  • ఇక వాహనాల సర్వీసు కేంద్రాలు లేక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పంక్చర్‌ పడితే కనీసం మరమ్మతులు చేసే దిక్కు ఉండటం లేదు. లాక్‌డౌన్‌ వల్ల చాలా వాహనాలు బయటకు తీయలేదు. పోలీసులు కూడా వందలాది వాహనాలను సీజ్‌ చేశారు. నెలల తరబడి ఇవి మూలకే పరిమితం కావడం వల్ల నడిపేందుకు వీలు లేకుండా ఉన్నాయని వాహనదారులు వాపోతున్నారు.
  • ఇవేకాక ఇంట్లో నిత్యం వినియోగించే వస్తువులకు సర్వీసు లేక పాడయ్యాయి. వాటర్‌ ఫ్యూరిఫైయర్లు, గ్యాస్‌ స్టవ్‌లు, మిక్సర్‌ గ్రైండర్లు, ఏసీలు, కూలర్లు, ఫ్రిడ్జ్​లు ఇతర ఎలక్ట్రానిక్స్‌ పరికరాలు చాలావరకు మరమ్మతులకు ఎదురు చూస్తున్నాయి. గతంలో ఫ్లంబర్లు, మెకానిక్‌లకు ఫోన్‌ చేస్తే వచ్చి రిపేరు చేసేవారు. ఇప్పుడు పిలిచినా రావడం లేదు. ఒకవేళ వచ్చినా...రెండు, మూడు రెట్లు ఛార్జీలు వసూలు చేస్తున్నారు.
  • సెల్‌ఫోన్‌ ఏ కారణంతోనైనా రిపేరుకు వచ్చినా సరే...గతంలో సర్వీసు సెంటర్‌కు ఇచ్చి ఒకటి రెండు రోజుల్లో మరమ్మతులు పూర్తి అయిన తర్వాత తిరిగి తెచ్చుకునే వారు. ప్రస్తుతం అన్ని రకాల సెల్‌ఫోన్ల అధీకృత సేవా కేంద్రాలు, ప్రైవేటు సెంటర్లు సైతం మూత పడ్డాయి. సెల్‌ఫోన్‌ పనిచేయక పోతే మూలన పడేసి ఇంట్లో ఉన్న పాత ఫోన్లు వాడుకునే పరిస్థితి వచ్చింది.

సడలింపులు ఉంటాయా..?

కరోనా కేసులు పెరుగుతుండటం వల్ల లాక్‌డౌన్‌ మరిన్ని రోజులు పొడిగించినా.. తాజాగా కొన్ని సేవలకు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. నిర్మాణ రంగంతోపాటు దాని అనుబంధ దుకాణాలు తెరిచేలా అవకాశం ఇచ్చారు. మరోసారి ఈ నెల 15న లాక్‌డౌన్‌పై ప్రభుత్వం సమీక్షించే అవకాశం ఉంది.

రోజు విడిచి రోజు 50 శాతం మేరకు పనిచేసేలా...ఇలాంటి సర్వీసింగ్‌ సెంటర్లకు వెసులుబాటు కల్పిస్తే మంచిదని పలువురు సూచిస్తున్నారు. ముఖ్యంగా వాహనాలు, గృహోపకరణాలు,ఇతరత్రా సర్వీసు కేంద్రాలకు సడలింపులు ఇవ్వాలని కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details