PEOPLE PROBLEMS OVER CM TOUR :ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరంలో పోలీసులు ఆంక్షలు పెట్టారు. సీఎం రోడ్డు షోకు వెళ్లే మార్గంలో దుకాణాలు తెరవనీయలేదు. కోటిపల్లి బస్టాండ్, డీలక్స్ సెంటర్‌లో దుకాణాలను పోలీసులు మూయించారు. వ్యాపారాలు చేసుకోవచ్చని మొన్న ట్రాఫిక్ పోలీసుల ఆదేశాలు ఇస్తే.. నేడు సీఎం పర్యటన దృష్ట్యా అవే దుకాణాలను పోలీసులు బంద్ చేయించారు.
" అన్నొస్తే.. అవస్థలే.. సీఎం వస్తే దారులన్నీ మూసేస్తారా" - జగన్ పర్యటనపై పోలీసుల ఆంక్షలతో ప్రజలు ఆగ్రహం
CM JAGAN TOUR :ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమంత్రి జగన్ పర్యటన అంటేనే ప్రజలు హడలెత్తుతున్నారు. సీఎం పర్యటన పేరు చెప్పి.. పొట్టకూటి కోసం వ్యాపారాలు చేసుకునే వారిపై పోలీసులు జూలు విధిలిస్తున్నారు. తాజాగా రాజమహేంద్రవరంలోనూ పోలీసులు తమ అధికారాన్ని చూపించారు.
![" అన్నొస్తే.. అవస్థలే.. సీఎం వస్తే దారులన్నీ మూసేస్తారా" CM JAGAN TOUR](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17384887-308-17384887-1672739030121.jpg)
సీఎం వస్తే దారులన్నీ మూసేస్తున్నారని ప్రజలు అగ్రహం
సీఎం వస్తే దారులన్నీ మూసేస్తున్నారని ప్రజలు అగ్రహం
రోడ్లకు అడ్డంగా బ్యారికేడ్లు పెట్టారు. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఎక్కడికక్కడ అడ్డుకుంటే ఎలా వెళ్లాలని నిలదీశారు. సీఎం వస్తున్నారని దారులన్నీ మూసేస్తారా..? అంటూ స్థానిక ప్రజలు అసహనం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: