హైదరాబాద్ రాజభవన్‌లో గవర్నర్ నరసింహన్ సమక్షంలో తెలుగు రాష్ట్రాల డీజీపీలు మహేందర్ రెడ్డి, ఆర్పీ ఠాకూర్ సమావేశమయ్యారు. పోలీసు శాఖలో ఉమ్మడిగా పెండింగ్లో ఉన్న సమస్యలపై చర్చించారు. పోలీసు శాఖలో చాలాకాలంగా పెండింగ్లో ఉన్న విభజన సమస్యలను త్వరగా పరిష్కరించుకోవాలని డీజీపీలకు నరసింహన్ సూచించారు.
ఇరు రాష్ట్రాల డీఎస్పీ, అదనపు ఎస్పీ, నాన్ క్యాడర్ ఎస్పీలకు చెందిన విభజన జరగాల్సి ఉంది. ఇందుకు సంబంధించి విస్తృత చర్చలు నిర్వహించి..రెండు రాష్ట్రాలకు చెందిన పోలీస్ అధికారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిష్కరించుకోవాలని పోలీస్ బాస్లు భావిస్తున్నారు.
విభజన సమస్యలను త్వరగా పరిష్కరించుకోవాలి:గవర్నర్ - DGP MAHENDHAR REDDY AND RP THAKUR
పోలీసు శాఖలో చాలాకాలంగా పెండింగ్లో ఉన్న విభజన సమస్యలను త్వరగా పరిష్కరించుకోవాలని తెలుగురాష్ట్రాల డీజీపీలకు గవర్నర్ నరసింహన్ సూచించారు.
![విభజన సమస్యలను త్వరగా పరిష్కరించుకోవాలి:గవర్నర్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3145370-thumbnail-3x2-governor.jpg)
విభజన సమస్యలకు సంబంధించి త్వరగా పరిష్కరించుకోవాలి : గవర్నర్
ఇవీ చూడండి: వారణాసిలో నిజామాబాద్ పసుపు రైతుల ఆందోళన