తెలంగాణ

telangana

ETV Bharat / state

పీఈసెట్​ - 2019 ఫలితాలు విడుదల - ఉన్నత విద్యామండలి ఛైర్మన్​

వ్యాయామ విద్య ప్రవేశ పరీక్ష - 2019లో గిరిజన బాలికలు సత్తా చాటారు. డీపెడ్​లో మొదటి పది ర్యాంకుల్లో ఐదింటిని ఎస్టీ బాలికలు దక్కించుకున్నారు. ఫలితాలను ఉన్నత విద్యామండలి ఛైర్మన్​ పాపిరెడ్డి విడుదల చేశారు. జూన్​ నెలాఖరులో కౌన్సిలింగ్​ షెడ్యూల్​ ప్రకటించనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో డీపెడ్​లో 350, బీపెడ్​లో 2 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి.

పీఈ సెట్​ ఫలితాలు

By

Published : May 27, 2019, 7:54 PM IST

వ్యాయామ విద్య ప్రవేశ పరీక్ష పీఈ సెట్​ ఫలితాలను ఉన్నత విద్యా మండలి ఛైర్మన్​ పాపిరెడ్డి విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 2,115 మంది బీపెడ్​... 1,819 మంది డీపెడ్​కు హాజరయ్యారు. బీపెడ్​లో 96.36 శాతం, డీపెడ్​లో 98.95 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రవేశ పరీక్షల్లో గిరిజన అమ్మాయిలు సత్తా చాటారు. డీపెడ్​లో మొదటి పది ర్యాంకుల్లో ఐదింటిని ఎస్టీ బాలికలు దక్కించుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన పాయం చంద్రకళ డీపెడ్​లో మొదటి ర్యాంకు... నల్గొండ జిల్లా దేవరకొండకు చెందిన పట్లావత్​ మౌనిక రెండో ర్యాంకును కైవసం చేసుకున్నారు. జూన్​ నెలాఖరులో కౌన్సిలింగ్​ షెడ్యూల్​ను ప్రకటించనున్నట్లు పాపిరెడ్డి తెలిపారు. మొత్తంగా డీపెడ్​లో 350, బీపెడ్​లో 2 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి.

పీఈసెట్​ ఫలితాలు విడుదల చేసిన ఉన్నత విద్యామండలి ఛైర్మన్​ పాపిరెడ్డి

ABOUT THE AUTHOR

...view details