లాక్‌డౌన్ కారణంగా జంట నగరాల్లోని ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. నగరంలోని రోడ్లన్నీ జన సంచారం లేక నిర్మానుష్యంగా మారాయి. రహదారులపై జనాలు, వాహనాల రద్దీ లేకపోవడం వల్ల... అడవుల్లో ఉండే మయూరాలు రోడ్లపైకి వస్తున్నాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని కేబీఆర్ జాతీయ ఉద్యానవనం వద్ద మయూరాలు స్వేచ్ఛగా బయట విహరిస్తున్నాయి. పార్క్ అవతలకు వచ్చి రోడ్లపై అటు ఇటు తిరుగుతూ... ఆనందంగా పురివిప్పి నాట్యమాడాయి. ఈ దృశ్యాలు అక్కడున్నవారిని కనువిందు చేశాయి.
ఇళ్లల్లో ప్రజలు... రోడ్లపైకి మయూరాలు - Hyderabad Jubilee Hills KBR National Park
ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్నాళ్లు బయట తిరిగిన ప్రజలు ఇళ్లకే పరిమితమవగా... అరణ్యాలకు పరిమితమైన మయూరాలు రోడ్లపైకి వస్తున్నాయి. జూబ్లీహిల్స్ కేబీఆర్ పార్కులోని మయూరాలు రహదారులపై స్వేచ్ఛగా విహరిస్తూ... పురివిప్పి నాట్యమాడాయి.
![ఇళ్లల్లో ప్రజలు... రోడ్లపైకి మయూరాలు Peacocks](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6643412-368-6643412-1585900457744.jpg)
Peacocks