తెలంగాణ

telangana

ETV Bharat / state

ఐడియల్​ చెరువు వద్ద ప్రశాంతంగా గణేశ్​ నిమజ్జనాలు - గణేశ్​ నిమజ్జనాల వార్తలు

హైదరాబాద్​ కూకట్​పల్లి ఐడియల్ చెరువు వద్ద గణేశ్​ నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఇళ్లల్లో, చిన్న కార్యాలయాలలో ప్రతిష్ఠించిన విగ్రహాలు నిమజ్జనం చేశారు. ప్రతి సంవత్సరం జనసందోహం ఉండే ఐడియల్​ చెరువు వద్ద ప్రస్తుతం నిర్మానుష్యంగా మారింది.

ఐడియల్​ చెరువు వద్ద ప్రశాంతంగా గణేశ్​ నిమజ్జనాలు
ఐడియల్​ చెరువు వద్ద ప్రశాంతంగా గణేశ్​ నిమజ్జనాలు

By

Published : Sep 1, 2020, 4:40 PM IST

హైదరాబాద్​ కూకట్​పల్లి ఐడియల్ చెరువు వద్ద గణేశ్​ నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. కొవిడ్ కారణంగా ప్రభుత్వాలు కచ్చితమైన నిబంధనలు పెట్టడం వల్ల చాలా వరకు మండపాలు ఏర్పాటు చేయలేదు. ఇళ్లల్లో, చిన్న కార్యాలయాలలో ప్రతిష్ఠించిన విగ్రహాలు నిమజ్జనం చేశారు. ప్రతి సంవత్సరం జనసందోహం ఉండే ఐడియల్​ చెరువు వద్ద ప్రస్తుతం నిర్మానుష్యంగా మారింది.

ఇదివరకే నిమజ్జనం చేసిన గణనాథుల వ్యర్థాలను క్రేన్ సాయంతో జీహెచ్ఎంసీ సిబ్బంది ఎప్పటికప్పుడు తరలిస్తున్నారు. ఏది ఏమైనా నిమజ్జనం అంటే కళగా ఉండే ఐడియల్ చెరువు.. కరోనా కారణంగా కళ తప్పి నిర్మానుష్యంగా కనిపిస్తోంది.

ఇవీచూడండి:వేలం పాట రద్దు.. ఈసారి బాలాపూర్​ లడ్డు ముఖ్యమంత్రి కేసీఆర్​కే..

ABOUT THE AUTHOR

...view details