ఉత్తరప్రదేశ్‌లో బడుగు బలహీన వర్గాల ప్రజలకు రక్షణ కరువైందని పీవోడబ్ల్యూ, పీవైఎల్, పీడీఎస్‌యూ సంఘాలు ప్రతినిధులు మండిపడ్డారు. యూపీ ఘటనపై పీవోడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు ఝాన్సీ మండిపడ్డారు.
'యూపీలో మూగజీవులకు ఉన్న రక్షణ అమ్మాయిలకు లేదు' - హైదరాబాద్ తాజా వార్తలు
బడుగు బలహీన వర్గాల ప్రజలకు రక్షణ కరువైందని పీవోడబ్ల్యూ, పీవైఎల్, పీడీఎస్‌యూ సంఘాలు ప్రతినిధులు మండిపడ్డారు. యూపీలో మూగజీవులకు ఉన్న రక్షణ అమ్మాయిలకు లేకుండా పోయిందని పీవోడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు ఝాన్సీ అన్నారు.
pdsu protest in Hyderabad
యూపీలో మూగజీవులకు ఉన్న రక్షణ అమ్మాయిలకు లేకుండా పోయిందని అన్నారు. యూపీలో ప్రతి రెండు గంటలకు ఒక అత్యాచార ఘటనలు చోటుచేసుకుంటున్నాయని అన్నారు. యూపీ సీఎం ఆదిత్యనాథ్‌ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి:వైరస్ వ్యాప్తి తగ్గుతోంది.. 1 కంటే దిగువకు 'ఆర్' విలువ