నిరుద్యోగ భృతిపై అసెంబ్లీలో చర్చించాలని ప్రగతిశీల యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రదీప్ డిమాండ్ చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి ఆరు సంవత్సరాలు పుర్తవుతున్నా.. నిరుద్యోగలకు ఉద్యోగ అవకాశాలు, ప్రైవేటు ఉద్యోగస్థులకు ఉద్యోగ భద్రత కరువైందని మండిపడ్డారు. గురువారం అసెంబ్లీ ఎదుట నాగులు అనే ప్రైవేటు ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డారని.. ఇందుకు సీఎం కేసీఆరే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ విద్యానగర్లో నిరసన వ్యక్తం చేశారు.
నిరుద్యోగ భృతిపై అసెంబ్లీలో చర్చించాలి: పీడీఎస్యూ - విద్యానగర్లో పీడీఎస్యూ కార్యకర్తల నిరసన
నిరుద్యోగ సమస్యపై అసెంబ్లీలో చర్చించి ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని, ప్రైవేటు ఉద్యోగస్థులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఉపాధి కోల్పోయిన వారి కుటుంబాలను ఆదుకోవాలని ప్రగతిశీల యువజన సంఘం నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు హైదరాబాద్ విద్యానగర్లో నిరసనకు దిగారు.
అసెంబ్లీలో నిరుద్యోగ భృతిపై చర్చించాలంటూ నిరసన
కరోనా వల్ల ప్రైవేటు ఉద్యోగస్థులకు ఉద్యోగ భద్రత లోపించిందని.. దినదిన గండం నూరేళ్ల ఆయుష్షులా జీవనం కొనసాగిస్తున్నారన్నారు. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు పద్ధతులను కొనసాగిస్తూ తక్కువ జీతాలతో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారన్నారు. ముఖ్యమంత్రి ఇప్పటికైనా నిరుద్యోగ భృతిపై అసెంబ్లీలో చర్చించాలని కోరారు.
ఇదీ చదవండిఃతెరాస ఎంపీలతో సీఎం కేసీఆర్ సమావేశం