తెలంగాణ

telangana

ETV Bharat / state

కిడ్నాపర్ రవిశేఖర్​పై పీడీ యాక్ట్ నమోదు - PD ACT ON CRIMINAL RaviShekar

ఇటీవల హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో యువతికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి.. కారులో అపహరించుకుని వెళ్లిన ఘటనలో నిందితుడిగా ఉన్న రవిశేఖర్​పై రాచకొండ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు.

కిడ్నాపర్ రవిశేఖర్​పై పీడీ యాక్ట్ నమోదు

By

Published : Nov 5, 2019, 11:41 PM IST

అపహరణలు, అత్యాచారాలకు పాల్పడే కరుడుగట్టిన నేరగాడు అయితం రవిశేఖర్‌పై రాచకొండ పోలీసులు పీడీ యాక్ట్​ కేసు నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన రవిశేఖర్‌ విజిలెన్స్‌, ఆదాయపన్ను శాఖ, సీఐడీ, అవినీతి నిరోధక శాఖ అధికారినని చెప్పుకుంటూ పలువురిని బురిడీ కొట్టించాడు. చౌకధరల దుకాణాలు, కిరాణా, ఎరువల దుకాణాలపై దాడులు నిర్వహించి అక్రమంగా డబ్బులు వసూలు చేసేవాడని పోలీసులు తెలిపారు. అమాయక యువతులను లక్ష్యంగా చేసుకొని ఉద్యోగాల పేరిట వారిని అపహరించి, అత్యాచారాలకు పాల్పడేవాడని పేర్కొన్నారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల్లో ఇతనిపై 38కి పైగా కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఇటీవల హయత్‌నగర్‌లో ఓ యువతికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పికారులో అపహరించుపోయాడు. కడప, చిలకలూరిపేట, అద్దంకి తదితర ప్రాంతాల్లో కారులో తిప్పుతూ ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ మేరకు వరుస నేరాలకు పాల్పడుతున్న రవిశేఖర్‌పై రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేష్‌భగవత్‌ ఆదేశాలతో పీడీ యాక్ట్ నమోదు చేశారు.

ఇవీచూడండి: దేవుడా అమ్మను చంపి నాన్న ఉరేసుకున్నాడు.. మా గతేంటి?

ABOUT THE AUTHOR

...view details