తెలంగాణ

telangana

ETV Bharat / state

నలుగురు సభ్యుల దొంగల ముఠాపై పీడీ చట్టం - హైదరాబాద్​ క్రైమ్​

సైబరాబాద్​ కమిషనరేట్​ పరిధిలో వరుస చోరీలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాపై పోలీసులు పీడీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఏప్రిల్​ 22న షామీర్​పేట పోలీసులు వీరిని అరెస్ట్​ చేశారు. తాజాగా పీడీ చట్టం ప్రయోగిస్తూ సీపీ సజ్జనార్​ నిర్ణయం తీసుకున్నారు.

నలుగురు సభ్యుల దొంగల ముఠాపై పీడీ చట్టం

By

Published : Jun 23, 2019, 9:17 AM IST

మూసి ఉన్న మద్యం దుకాణాలు, వ్యాపార సముదాయాలు, ఏటీఎం కేంద్రాల్లో చోరీలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాపై సైబరాబాద్​ పోలీసులు పీడీ చట్టం ప్రయోగించారు. వరుసకు సోదరులైన షేక్​ అజ్జు, ఖాదర్​, ఖయ్యూంలు అశోక్​ అనే మరో వ్యక్తితో కలసి​ సైబరాబాద్​ కమిషనరేట్​ పరిధిలో అనేక చోరీలు చేశారు. ద్విచక్రవాహనాలపై తిరుగుతూ తాళాలు వేసి ఉన్న దుకాణాల్లో దొంగతనాలకు పాల్పడేవారు. అనంతరం ఆధారాలు లేకుండా సీసీ కెమెరాలను ధ్వంసం చేసేవాళ్లు. ఏప్రిల్​ 22న షామీర్​పేట్​ పోలీసులు వీరిని అరెస్ట్​ చేశారు. తాజాగా వీరిపై పీడీ చట్టం ప్రయోగిస్తూ సీపీ సజ్జనార్​ నిర్ణయం తీసుకున్నారు. ఈ చట్టం ప్రకారం ఈ ముఠా సభ్యులు ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించాలి.

నలుగురు సభ్యుల దొంగల ముఠాపై పీడీ చట్టం

ABOUT THE AUTHOR

...view details