పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి అరెస్ట్‌ను... మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి ఖండించారు. రేవంత్ రెడ్డి డ్రోన్ కెమెరా వాడలేదని... ఆయన కెమెరా వాడినట్లు ఏమైనా ఆధారాలున్నాయా? అని పోలీసులను ఆయన ప్రశ్నించారు.
'కక్షసాధింపుతోనే రేవంత్‌రెడ్డి అరెస్ట్' - Ex MP Konda Vishweshwar Reddy Pressmeet
ప్రభుత్వం కక్షసాధింపుతోనే ఎంపీ రేవంత్‌రెడ్డిని అరెస్ట్చేసిందని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు. గాంధీభవన్‌లో పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
Vishweshwar Reddy
111 జీవో పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా ఫామ్ హౌస్ కట్టారని... దాన్ని వేలెత్తి చూపితే జైల్లో వేస్తారా? అని నిలదీశారు. అక్కడ చిన్నచిన్న గుడిసెలు వేసుకుంటేనే రంగారెడ్డి జిల్లా యంత్రాంగం కూల్చి వేస్తుందని తెలిపారు. అభివృద్ధికి అడ్డంకిగా మారిన జీవో 111ని సవరించాలని... లేదంటే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి :అసెంబ్లీలో నమస్కారం 'కరో'నా అంటున్న నేతలు