కోవిడ్-19 వల్ల రెండవ ప్రపంచ యుద్ధంలో జరిగిన ప్రాణ నష్టం కంటే ఎక్కువగా జరిగే ప్రమాదం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. లాక్‌డౌన్ కార్యక్రమంతోపాటు పేదలకు బియ్యం, నిత్యావసరాల పంపిణీలో జరుగుతున్న జాప్యం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తదితర అంశాలపై అఖిల పక్ష సమావేశంలో చర్చించారు.
'కీలక నిర్ణయాల్లో ప్రతిపక్షాలను భాగస్వాములుగా చేయాలి' - ts corona updates
కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పష్టీకరించారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై అఖిలపక్ష సమావేశంలో చర్చించారు.
కీలక నిర్ణయాల్లో ప్రతిపక్షాలను భాగస్వామ్యులు చేయాలి
కరోనా కట్టడిలో ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. కీలక నిర్ణయాల్లో ప్రతిపక్షాలను భాగస్వాములుగా చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కరోనా మహమ్మారి బారిన పడకుండా ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. లోపాలు ఎత్తి చూపిన ప్రతిపక్ష పార్టీల వార్తలు కూడా రాయాలని మీడియా ప్రతినిధులకు ఆయన విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి:లాక్‌డౌన్ ఎఫెక్ట్:17రోజుల బిడ్డను తొలిసారి చూసిన తల్లి