భూ వివాదంలో తలదూర్చడమే కాకుండా ప్రశ్నించిన వ్యక్తిపై బొడుప్పల్ కార్పొరేషన్ తెరాస కార్పొరేటర్ భర్త దాడికి దిగడం అమానుషం అన్నారు పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
'అందరి చేత కన్నీరు తెప్పించిన ఆ కార్పొరేటర్‌ను శిక్షించాలి' - hyderabad latest news
బొడుప్పల్ కార్పొరేషన్ పరిధిలో పట్టపగలే ఓ ఇంటి యజమాని మీద తెరాస కార్పొరేటర్ భర్త దాడికి దిగడం దారుణమని పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి అన్నారు. 'మా నాన్నను కొట్టొద్దు' అంటూ చిన్న పిల్లవాడు ఏడుస్తున్నా... ఇష్టానుసారంగా కొట్టారని.. ఆ దృశ్యాలు ప్రతి ఒక్కరినీ కన్నీరు పెట్టిస్తోందని చెప్పారు.
'దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి'
గూండాగిరి, దాదాగిరి పోవాలంటే ఇలాంటి వారిని ఎన్‌కౌంటర్ చేయిస్తేనే.. ఇతర అసాంఘిక శక్తులు భయపడతాయన్నారు. శ్రీధర్‌గౌడ్‌తోపాటు దాడిలో పాల్గొన్న వారందరిపై హత్యాయత్నం కేసులు నమోదు చేయాలని కోరారు. దాడికి పాల్పడిన వారందరిని శిక్షించాలని శాంతి భద్రతల అదనపు డీజీ జీతేందర్ కోరినట్లు తెలిపారు.