హైదరాబాద్ అభివృద్ధి నివేదికను మంత్రి కేటీఆర్ వక్రీకరించి... అవాస్తవాలను మాట్లాడుతున్నారని పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి ఆరోపించారు. కేటీఆర్ విడుదల చేసిన హైదరాబాద్ అభివృద్ధి నివేదిక.. అబద్ధాలకు అద్దంపడుతుందని ఎద్దేవా చేశారు.
గడిచిన ఆరున్నర సంవత్సరాల్లో హైదరాబాద్ అభివృద్ధికి రూ.67,000 కోట్లు వ్యయం చేశామన్న కేటీఆర్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత వివిధ ప్రాజెక్టులకు ఖర్చు చేసిన మొత్తాన్ని చూపించారని పేర్కొన్నారు. ఆ ప్రాజెక్టులను ప్రారంభించిన తేదీలను, గత కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తాన్ని చూపలేదన్నారు. హైదరాబాద్ సుందరీకరణ కోసం అనేక ప్రాజెక్టులను చేపట్టింది కాంగ్రెస్ కాదా అంటూ ప్రశ్నించారు.