రాష్ట్రంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించి కార్యకలాపాలు నిర్వహించొచ్చు... ప్రజల విశ్వాసంతో ముడిపడిన బోనాలు మాత్రం గడపదాటకుండా చేసుకోవాలా అని పీసీసీ అధికార ప్రతినిధి జి. నిరంజన్ నిలదీశారు. దైవభక్తితో ఆలయాలకు వెళ్లే భక్తులు మాత్రం తీర్థం తీసుకోకూడదు, ప్రసాదం పుచ్చుకోకూడదు, శఠగోపం పెట్టించుకోకూడదు... ప్రభుత్వ పెద్దలు మాత్రం బహిరంగంగా నీరా తాగొచ్చునా... తమకో న్యాయం, ప్రజలకో న్యాయమా అని ప్రశ్నించారు. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించి సమావేశాలు నిర్వహించుకుంటూ... ప్రజాప్రతినిధుల ముసుగులో అందరూ పాల్గొంటున్నారని ఆరోపించారు.
గడప దాటకుండా బోనాలు చేసుకోవాలా..? కాంగ్రెస్ నేతల నిలదీత.. - బోనాల నిర్వహణపై పీసీసీ అధికార ప్రతినిధి నిరంజన్ వ్యాఖ్యలు
రాష్ట్రంలో బోనాల ఉత్సవాలు ఎవరింట్లో వారే చేసుకోవాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని పీసీసీ అధికార ప్రతినిధి జి. నిరంజన్ తప్పుబట్టారు. ప్రజాప్రతినిధులకో న్యాయం, ప్రజలకో న్యాయమా అని ప్రశ్నించారు.
గడప దాటకుండా బోనాలు చేసుకోవాలా..?: పీసీసీ