ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని పీసీసీ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం డిమాండ్ చేశారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డికి టీపీసీసీ అధ్యక్ష పదవి కేసీఆర్ వల్లే వచ్చిందని కేటీఆర్ చెప్పడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు ముఖ్యమంత్రి పదవి బిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీనే అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు.
'నిరుద్యోగ భృతి పట్ల సీఎం నాటకాలాడుతున్నారు' - pcc spokes person medipalli satyam latest news
నిరుద్యోగ భృతి పట్ల సీఎం కేసీఆర్ నాటకాలు ఆడుతున్నారని పీసీసీ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం విమర్శించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
'నిరుద్యోగ భృతి పట్ల సీఎం నాటకాలాడుతున్నారు'
నిరుద్యోగ భృతి పట్ల సీఎం కేసీఆర్ నాటకాలు ఆడుతున్నారని సత్యం ఆరోపించారు. ఉద్యోగులకు 60 శాతం ఫిట్మెంట్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యోగుల తరఫున పెద్దఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఉద్యోగాల భర్తీని వెంటనే చేపట్టాలన్నారు.