కరోనా కల్లోలం సృష్టిస్తున్న తరుణంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను సేవాకార్యక్రమాలతో జరుపుకోవాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులకు సూచించారు. నిరుపేదలకు బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలని కోరారు. పేదలకు అన్నదానం చేయాలని విజ్ఞప్తి చేశారు.
'సేవా కార్యక్రమాలు ముద్దు... కేక్ కటింగ్‌లు వద్దు' - telangana news
రాహుల్ గాంధీ జన్మదిన వేడుక సందర్భంగా నిరుపేదలకు బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులకు, నాయకులకు విజ్ఞప్తి చేశారు. కరోనా కల్లోలం సృష్టిస్తున్న తరుణంలో కేక్‌లు కట్ చేయవద్దని స్పష్టం చేశారు.

పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి
కొవిడ్ బాధితులకు మందులు, పండ్ల పంపిణీ లాంటి కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ నేతలకు సూచించారు. అలాగే కరోనాతో మృతి చెందిన కుటుంబాలను కలిసి పరామర్శించాలన్నారు. ఈ నెల 19వ తేదీన రాహుల్ పుట్టిన రోజు జరుపుకోనున్నారు.
ఇదీ చదవండి:'మహారాష్ట్రలో మధ్యంతర ఎన్నికలా?'