తెలంగాణ

telangana

ETV Bharat / state

వరదసాయం పేరుతో తెరాస నేతలు దోచుకున్నారు: ఉత్తమ్​

హైదరాబాద్‌ అభివృద్ధి కాంగ్రెస్‌ వల్లే జరిగిందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వెల్లడించారు. వరద సాయం కోసం వందల కోట్లు ఖర్చు చేశామంటూ... తెరాస అసత్యాలు చెబుతోందని ఆరోపించారు. తెరాస, భాజపాలకు జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు లేదని ఉత్తమ్‌ మండిపడ్డారు.

uttam kumar reddy
uttam kumar reddy

By

Published : Nov 22, 2020, 6:51 PM IST

అవినీతికి మారుపేరు తెరాస అని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి విమర్శించారు. వరద సాయం కోసం వందల కోట్లు ఖర్చు చేశామంటున్నారని... రూ.5 కోట్లు మాత్రమే ప్రజలకు చేరుంటాయని ఆరోపించారు. వరద సాయం పేరుతో తెరాస నేతలు దోచుకున్నారన్నారు. భారీ వర్షాలకు వందల మంది మరణిస్తే బాధిత కుటుంబాలను పరామర్శించని ముఖ్యమంత్రి కేసీఆర్​కు ఓట్లు అడిగే హక్కు ఉందా అని ప్రశ్నించారు.

ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ ఇన్‌వెస్ట్‌మెంట్‌ రీజియన్‌ రద్దయితే స్థానిక భాజపా నోరు మెదపలేదు. పార్లమెంట్‌లో అన్ని విషయాల్లో భాజపాకు తెరాస మద్దతు పలికింది. దేశవ్యాప్తంగా భాజపాకు మద్దతు పలికేందుకు ఎంఐఎం రాజకీయాలు చేస్తోంది.

- ఉత్తమ్​ కుమార్​ రెడ్డి, పీసీసీ చీఫ్​

వరదసాయం పేరుతో తెరాస నేతలు దోచుకున్నారు: ఉత్తమ్​

ఇదీ చదవండి :సీఎం కేసీఆర్​తో సినీరంగ ప్రముఖుల సమావేశం

ABOUT THE AUTHOR

...view details