పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్‌కు ఫోన్ చేశారు. వరద సహాయంలో భారీ కుంభకోణం జరిగిందని ఆరోపించారు. ఈ కుంభకోణంపై సమగ్ర విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. వరద సహాయక చర్యల్లో తెరాస నాయకులు, కార్యకర్తలు కోట్లు రూపాయలు కొట్టేశారని విమర్శించారు. కోట్లాది రూపాయలు ప్రజాధనం దుర్వినియోగమైందన్న ఆయన.. బాధిత కుటుంబాలకు సాయం నగదు రూపంలో కాకుండా చెక్కు రూపంలో ఇవ్వాలని డిమాండ్ చేశారు.
వరద సహాయంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి - etv bharat
హైదరాబాద్ వరద సహాయంలో భారీ కుంభకోణం జరిగిందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయమై రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్‌కు ఫిర్యాదు చేశారు. గవర్నర్‌తో ఫోన్లో మాట్లాడిన ఉత్తమ్.. జరిగిన కుంభకోణంపై సమగ్ర విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు.
వరద సహాయంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి
బాధితులకు వరద సహాయం రూ.10 వేల నుంచి 50 వేలకు పెంచాలని కోరారు. నిజమైన బాధితులకు వరద సాయం అందలేదన్నారు. పార్టీ శ్రేణులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కేసీఆర్ నగదు పంపిణీ చేశారని ఆరోపించారు. వరదల్లో పెద్ద సంఖ్యలో జనం చనిపోయినా.. వేల మంది నిరాశ్రయులైనా.. కేసీఆర్ కనీసం పరామర్శించకపోవడం దారుణమన్నారు.
ఇదీ చదవండి:ధరణి లాంటి పథకం ప్రపంచంలోనే ఉండదు: మంత్రి శ్రీనివాస్ గౌడ్