తెలంగాణ

telangana

ETV Bharat / state

'వినతిపత్రం ఇచ్చేందుకు కూడా అనుమతి ఇవ్వడం లేదు'

హైదరాబాద్ దిల్‌కుష్ గెస్ట్​ హౌజ్ వద్ద కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మనిక్కం ఠాగూర్, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో సహా పలువురు కాంగ్రెస్‌ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి విలువలేకుండా పోయిందని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆరోపించారు. కొత్త వ్యవసాయ చట్టం అమలు వద్దంటూ గవర్నర్‌కు అనుమతి ఇవ్వాలని భావిస్తున్నామని తెలిపారు. గవర్నర్‌కు కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు కూడా పోలీసులు అనుమతి ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

pcc president uttam kumar said Petition is also not even allowed
'వినతిపత్రం ఇచ్చేందుకు కూడా అనుమతి ఇవ్వడం లేదు'

By

Published : Sep 28, 2020, 2:23 PM IST

'వినతిపత్రం ఇచ్చేందుకు కూడా అనుమతి ఇవ్వడం లేదు'

హైదరాబాద్ దిల్‌కుష్ గెస్ట్​ హౌజ్ వద్ద కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మనిక్కం ఠాగూర్, పీసీసీ అధ్యక్షుడు ఉత్తకుమార్ రెడ్డితో సహా పలువురు కాంగ్రెస్‌ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. కేంద్రం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ రాష్ట్ర గవర్నర్‌ను కలిసి వినతిపత్రం అందించేందుకు యత్నించిన కాంగ్రెస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు.

గవర్నర్‌ను కలిసేందుకు అనుమతిలేదని పోలీసులు స్పష్టం చేసినప్పటికీ దిల్‌కుష్ గెస్ట్‌ హౌజ్ నుంచి నేతలు బయటకు రావడానికి యత్నించడం వల్ల పోలీసులకు కాంగ్రెస్ నాయకులకు మధ్య తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుంది.

కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్న కాంగ్రెస్ నాయకులను బలవంతంగా పోలీసుల వాహనంలో ఎక్కించి అరెస్టు చేశారు. మనిక్కం ఠాగూర్, ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి బోసు రాజు, సంపత్ ‌కుమార్, గూడూరు నారాయణ రెడ్డి, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు నేరేళ్ల శారద, తదితర మహిళా నాయకులను అరెస్టు చేసి గోషామహల్ ఠాణాకు తరలించారు.

"రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా పోయింది. నిరసనలు తెలపడానికి కూడా ఈ ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదు. కొత్త వ్యవసాయచట్టం అమలు వద్దంటూ గవర్నర్‌కు అనుమతి ఇవ్వాలని భావిస్తున్నాం. గవర్నర్‌కు కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు కూడా పోలీసులు అనుమతి ఇవ్వడం లేదు."

ఉత్తమ్​ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

ఇదీ చూడండి :సర్వేతో గట్టు గొడవలు లేకుండా పోతాయి: హరీశ్ రావు

ABOUT THE AUTHOR

...view details