కాంగ్రెస్ నేతల అరెస్టును పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ ఖండించారు. ఎల్లూరు లిఫ్టులో ప్రమాదం వల్ల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ఉత్తమ్ అన్నారు. మానవ తప్పిదం కారణంగానే ఎల్లూరు లిఫ్టులో ప్రమాదం జరిగిందని చెప్పారు. 14 అంతస్తుల కల్వకుర్తి పంప్‌హౌస్‌లో 10 అంతస్తులు నీటిలో మునిగాయని తెలిపారు.
కాంగ్రెస్ నేతల అరెస్టు అనైతికం: ఉత్తమ్ - PCC president Uttam latest news
కాంగ్రెస్ నేతల అరెస్టుపై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి మండిపడ్డారు. ఎత్తిపోతల పథకంలో భాగంగా అండర్‌గ్రౌండ్ తవ్వకాలు చేస్తున్నారని వివరించారు. పేలుడు వల్లనే పెద్దమొత్తంలో నష్టం జరిగిందని అన్నారు. ఘటనకు పూర్తిగా సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
పంప్‌హౌస్‌కు సమీపంలోనే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఎత్తిపోతల పథకంలో భాగంగా అండర్‌గ్రౌండ్ తవ్వకాలు చేస్తున్నారని వివరించారు. పేలుడు వల్లనే పెద్దమొత్తంలో నష్టం జరిగిందని అన్నారు. ఘటనకు పూర్తిగా సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. 2016లో నిపుణుల కమిటీ నివేదికను ప్రభుత్వం తుంగలో తొక్కిందని వెల్లడించారు. ప్రాజెక్టులతో కాల్వలు నిండట్లేదు కానీ కమీషన్లలతో జేబులు నిండుతున్నాయని విమర్శించారు. కాళేశ్వరం, మిడ్‌మానేరు, కొండపోచమ్మసాగర్ ప్రాంతాల్లో ప్రాజెక్టులకు గండ్లు పడ్డాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవలే శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో ఘోర ప్రమాదం జరిగిందని గుర్తు చేశారు. పారదర్శకంగా న్యాయ విచారణ చేసి దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు.