తెలంగాణ

telangana

ETV Bharat / state

Uthham kumar reddy: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి - సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తాజా వార్తలు

హైదరాబాద్ రాజ్​భవన్​లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. తెలుగు వ్యక్తి అత్యున్నత పదవికి నియామకమవడం అభినందనీయమని తెలిపారు.

pcc president uthham kumar reddy met Chief Justice of the Supreme Court Justice NV Ramana
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి

By

Published : Jun 12, 2021, 4:41 PM IST

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కలిశారు. హైదరాబాద్ రాజ్​భవన్​లో మర్యాదపూర్వకంగా సీజేఐని ఆయన కలిసి అభినందనలు తెలియజేశారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తి అత్యున్నత పదవికి నియామకం కావడం తెలుగు ప్రజలకు గర్వకారణంగా ఉందని కొనియాడారు.

తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 42కు పెంచడం పట్ల ఉత్తమ్​ కుమార్​రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. న్యాయమూర్తుల నియామకాల్లో సామాజిక న్యాయం పాటించాలని ఆదేశించడాన్ని ఆహ్వానిస్తున్నామన్నారు. మరోవైపు, ఎన్వీ రమణను పీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ మల్లు రవి కలిశారు. చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ జస్టిస్ రమణను అభినందించారు. హైకోర్టు జడ్జీలు నియామకంలో సామాజిక న్యాయం పాటించాలని నిర్ణయించడం హర్షణీయమని... సీబీఐ డైరెక్టర్ నియామకంలో కూడా కీలక పాత్ర పోషించడం అభినందనీయమన్నారు.

ఇదీ చూడండి:Etala: 'హుజూరాబాద్‌లో కౌరవులు, పాండవులకు మధ్య యుద్ధం'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details