రైతు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం ముందు పీసీసీ కిసాన్ సెల్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించింది. కార్యక్రమంలో కిసాన్ సెల్ అధ్యక్షుడు అన్వేష్‌రెడ్డి పాల్గొన్నారు. ఇటీవల భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 30 వేలు ఇవ్వాలని కిసాన్ సెల్ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి కోరారు.
రైతు సమస్యలు పరిష్కరించాలని పీసీసీ కిసాన్ సెల్ ధర్నా - pcc kisan cell dharna in hyderabad
హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం ముందు పీసీసీ కిసాన్ సెల్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించింది. భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
![రైతు సమస్యలు పరిష్కరించాలని పీసీసీ కిసాన్ సెల్ ధర్నా pcc kisan cell dharna in hyderabad for justice to farmers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8737757-527-8737757-1599647318055.jpg)
రైతుల సమస్యలు పరిష్కరించాలని పీసీసీ కిసాన్ సెల్ ధర్నా
మొక్కజొన్న పంట కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని అన్వేష్‌రెడ్డి కోరారు. సబ్సిడీ ద్వారా రైతులకు ఇచ్చిన సోయా విత్తనాలు మొలకెత్తిన నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 30 వేలు ఇవ్వాలని.. రెండు సంవత్సరాల నుంచి రైతులకు రావాల్సిన వడ్డీ రాయితీని వెంటనే చెల్లించాలని.. రుణమాపీని ఏకకాలంలో వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి:శాసనసభలో స్పీకర్‌తో విపక్షాల వాగ్వాదం