తెలంగాణ

telangana

ETV Bharat / state

Jaggareddy: 'పార్టీ విషయాల్లో జోక్యం చేసుకోను.. షోకాజ్​ నోటీసు ఇస్తారో లేదో వాళ్ల ఇష్టం' - congress party

2023 వరకు కాంగ్రెస్‌కు సంబంధించిన ఏ విషయాల్లో జోక్యం చేసుకోనని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి (PCC Executive President Jaggareddy) స్పష్టంచేశారు. ఉన్నది ఉన్నట్లు చెబితే ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. హుజురాబాద్‌కు తమ పార్టీ సూపర్‌స్టార్లు వెళ్తేనే ఓట్లు రాలేదని... తాను వెళ్తే వస్తాయా అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.

PCC Executive President Jaggareddy
పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి

By

Published : Nov 3, 2021, 2:24 PM IST

2023 వరకు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఏ అంశాలను మాట్లాడనని కాంగ్రెస్‌ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (PCC Executive President Jaggareddy) స్పష్టం చేశారు. షోకాజ్ నోటీసు ఇస్తారా లేదా అనేది వారిష్టమని పేర్కొన్నారు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడమే తనకు అలవాటని దానితోనే పార్టీలో లొల్లి అవుతుందని ఆయన పేర్కొన్నారు. అదే తన బలహీనతని వెల్లడించారు.

పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి

హుజూరాబాద్​ ఉపఎన్నికలో ఓడిపోవడంపై కాంగ్రెస్ నేతలు గాంధీభవన్​లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ భేటీలో పాల్గొనేందుకు జగ్గారెడ్డి (PCC Executive President Jaggareddy) గాంధీభవన్‌కు వెళ్లారు. పార్టీ సమావేశంలో అడగాల్సిన అన్నీ అంశాలు అడుగుతానని జగ్గారెడ్డి (PCC Executive President Jaggareddy) తెలిపారు. పార్టీలో ఏదైనా లోటుపాట్లు ఉంటే ఎత్తి చూపుతానని స్పష్టం చేశారు. పార్టీ సహకారం ఉన్నా లేకున్నా తన సీటు గెలుచుకుంటానని వెల్లడించారు. మంచి మంచి వాళ్లు హుజూరాబాద్‌ వెళ్లి ప్రచారం చేసినా ఓట్లు పడలేదని... నేను పోతే ఓట్లు పడతాయా అని జగ్గారెడ్డి (PCC Executive President Jaggareddy) ప్రశ్నించారు.

2023 వరకు కాంగ్రెస్‌కు సంబంధించి ఏ విషయమూ మాట్లాడను. షోకాజ్​ నోటీసు ఇస్తారా లేదా అన్నది వారి ఇష్టం. ఉన్నది ఉన్నట్లు చెబితే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. హుజురాబాద్‌లో మా పార్టీ సూపర్‌స్టార్లు ప్రచారం చేసినా ఓట్లు రాలేదు. హుజురాబాద్‌కు నేను వెళ్లుంటే ఓట్లు వచ్చేవా? పార్టీలో ఎవరి సహకారం లేకపోయినా నేను సీటు గెలవగలను.

ABOUT THE AUTHOR

...view details