కేసీఆర్, మోదీల అప్రజాస్వామిక పాలనకు హుజూరాబాద్ ప్రజలు బుద్ధి చెప్పాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు(Ponnala laxmaiah on modi and kcr) పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు. ఏడేళ్ల పాలనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు(Ponnala laxmaiah on modi and kcr) తెలంగాణకు ఏమీ చేయలేదని ఆరోపించారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టి. అంజయ్య వర్ధంతిని గాంధీభవన్‌లో నిర్వహించారు. అంజయ్య చిత్రపటానికి పలువురు కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
కేసీఆర్, మోదీల అప్రజాస్వామిక పాలనకు బుద్ధి చెప్పాలి: పొన్నాల ప్రజాహితమైన పాలననా.?
చమురు ధరలను కేంద్రం అడ్డూఅదుపు లేకుండా పెంచుకుంటూ పోతోందని లక్ష్మయ్య(Ponnala laxmaiah on modi and kcr) ఆగ్రహం వ్యక్తం చేశారు. రవాణా ఖర్చులు పెరగడమే గాక నిత్యావసరాల ధరలు మండిపోతున్నాయన్నారు. ఇది ప్రజా హితమైన పాలననా అని ప్రశ్నించారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో కాంగ్రెస్‌కు మద్దతు పలకాలి.. గెలిపించాలని ప్రజలకు(Ponnala laxmaiah on modi and kcr) విజ్ఞప్తి చేశారు.
దేశంలో 60 శాతం ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేవు. పార్లమెంటులో చర్చ లేకుండా వ్యవసాయ నల్ల చట్టాలను తీసుకొచ్చారు. హుజురాబాద్ ప్రజలకు భాజపా వీటిపై ఏం సమాధానం చెబుతుంది.? కేంద్ర ప్రభుత్వానికి మద్దతిస్తున్న కేసీఆర్ కూడా వీటిపై సమాధానం చెప్పాలి. -పొన్నాల లక్ష్మయ్య, పీసీసీ మాజీ అధ్యక్షుడు
ఇదీ చదవండి:Huzurabad constituency Voters : ఓటు మీట.. భవిష్యత్‌కు బాట