తెరాస ప్రభుత్వం పరువు కాపాడుకోవడంలో భాగంగానే నల్గొండ నివేదన సభను నిర్వహించారని... పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఓట్ల కోసం నాలుగు హామీలు ఇవ్వడం ఆ పార్టీకి అలవాటేనని విమర్శించారు. నాగర్జుననాగర్ నియోజకవర్గంలో దాదాపు 45 వేలకు పైగా గిరిజనులు ఉన్నారనే ముఖ్యమంత్రి కేసీఆర్ హామీలు గుప్పించారని ఆరోపించారు.
'ఎన్నికలు వచ్చినప్పుడల్లా హామీలివ్వడం తెరాసకు అలవాటే' - హైదరాబాద్ తాజా వార్తలు
ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఓట్ల కోసం నాలుగు హామీలు ఇవ్వడం తెరాసకు అలవాటేనని... పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక వస్తుందనే నల్గొండ నివేదన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించారని విమర్శించారు.
'ఎన్నికలు వచ్చినప్పుడల్లా హామీలివ్వడం తెరాసకు అలవాటే'
భద్రాచలంలో మహిళా గిరిజన రైతులను చెట్లకు కట్టేసి కొడితే ఏం చేశారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సీఎం రెసిడెన్సీలో ప్రతి సోమవారం ప్రజా అభ్యర్థనలను స్వీకరించేవారిమని, దాని కోసం వేలాది మంది ప్రజలు వస్తుండేవారని అన్నారు. 2018లో ప్రతి ఇంటికి తాగు నీరు ఇస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్... ఇప్పటికీ ఇవ్వలేదని విమర్శించారు.
ఇదీ చదవండి: గ్రేటర్ పీఠంపై ఉత్కంఠ: ఎవరి బలం ఎంత?