ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతి బయటపడే రోజులు దగ్గరపడ్డాయని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. కాళేశ్వరం అవినీతిని నిరూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. తనతో చర్చకు వస్తే.. గణాంకాలతో సహా నిరూపిస్తానని ఆయన సవాల్ విసిరారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో భూగర్భ జలాలు పెరిగాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. 16 టీఎంసీల నీటికే భూగర్భ జలాలు పెరిగితే.. నాగార్జున సాగర్, జూరాల, శ్రీశైలం ప్రాజెక్టుల కింద ఎంత మేర భూగర్భ జలాలు పెరుగుతాయని ప్రశ్నించారు. వనపర్తి, సంగారెడ్డి ప్రాంతాల్లో భూ గర్భ జలాలు బాగా పెరిగాయన్న ఆయన.. అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు ఉందా అని నిలదీశారు. సామాన్య ప్రజలను నమ్మించేందుకే తూ తూ మంత్రంగా నీటిని పంపింగ్ చేస్తున్నారని అన్నారు.
టీకా ఎందుకు వేసుకోలేదు?