జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ మీడియాకు విడుదల చేసిన ప్రకటన... ప్రజలను, ప్రతి పక్షాలను గందరగోళంలో పడేసే కుట్రలో భాగమేనని పీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ కన్వీనర్ నిరంజన్ ఆరోపించారు. ప్రభుత్వం తరఫున మున్సిపల్ ముఖ్య కార్యదర్శి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కలిసి ఎన్నికలకు ప్రభుత్వం తరఫున సంసిద్ధతను తెలియజేసిన తర్వాత ప్రభుత్వ ప్రమేయం ఉండదన్నారు.
జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఎందుకు గందరగోళం సృష్టిస్తున్నారు: కాంగ్రెస్ - Hyderabad latest news
జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ తీరుపై పీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ కన్వీనర్ నిరంజన్ మండిపడ్డారు. ఎన్నికలపై లోకేశ్‌కుమార్ గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించారు.

ఆ తరువాత నిర్ణయాలు తీసుకునే బాధ్యత రాష్ట్ర ఎన్నికల కమిషన్‌దేనని ఆయన తెలిపారు. గ్రేటర్ ఎన్నికల నిర్వహణ అంశంపై నిర్ణయం తీసుకునే అధికారము రాష్ట్ర ఎన్నికల కమిషన్‌దేనని, అయితే ఎన్నికల యంత్రాంగాన్ని సన్నద్ధం చేసే బాధ్యత ఎన్నికల అథారిటీకి, జీహెచ్‌ఎంసీ కమిషనర్లకు ఉంటుందని వివరించారు. ఏదైనా... తప్పుడు కథనాలు మీడియాలో వస్తే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ జోక్యం చేసుకుని వివరణ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. కానీ జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ జోక్యం చేసుకుని ఎందుకు గందరగోళం సృష్టిస్తున్నారని ఆయన ప్రశ్నించారు.