హైకోర్టు వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రంలో మినీ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని పీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ కన్వీనర్ జి.నిరంజన్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. కొవిడ్ విజృంభిస్తుండడం వల్ల ఇప్పటికే అనేక రాష్ట్రాలు కర్ఫ్యూ విధించాయని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా రాత్రి కర్ఫ్యూ విధించిందని ఆయన గుర్తు చేశారు.
ఎన్నికలను వాయిదా వేయాలని ఎస్ఈసీకి కాంగ్రెస్ విజ్ఞప్తి - PCC Election Coordinating Committee Convener G. Niranjan
రాష్ట్రంలో మినీ మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేయాలని ఎస్ఈసీకి కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది. హైకోర్టు వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకుని ఎన్నికలను నిలిపివేయాలని పీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ కన్వీనర్ జి.నిరంజన్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు.

రాజకీయ పార్టీలను, ప్రజలను, ఎన్నికల సిబ్బందిని ఇబ్బందులకు గురి చేయవద్దని కోరారు. సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా.... హాలియాసభలో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కరోనా సోకిందని... ప్రభుత్వ కార్యాలయాల్లో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యాలయాలకు రావాలంటే ప్రజలు భయపడుతున్నారని... ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు 12వేల మంది పని చేయాల్సి వస్తుందని అన్నారు. ఇంతమందిని ఇబ్బంది పెట్టడం అవసరమా అని ప్రశ్నించారు. ప్రజలను భయబ్రాంతులకు లోను చేయొద్దని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరారు.
ఇదీ చదవండి:2025 నాటికి 15 విద్యుత్ కార్లు: టొయోటా