ప్రభుత్వ చర్యతో తెలంగాణ జిల్లాలు ఎడారిగా మారబోతున్నాయని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. నాగార్జునసాగర్ ఎండిపోతుంది.. హైదరాబాద్‌కు మంచి నీటి సమస్య వస్తుందని పేర్కొన్నారు. కాళేశ్వరం నుంచి 2 టీఎంసీలు ఎత్తిపోతకు రూ.లక్ష కోట్లు ఖర్చుపెడుతున్నారని తెలిపారు. భావితరాల జీవితాలు తాకట్టు పెట్టి పథకం చేపడుతున్నారని మండిపడ్డారు. పోతిరెడ్డిపాడు అంశంపై కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇదే విషయమై కేంద్రమంత్రి షెకావత్‌తో కూడా మాట్లాడినట్లు స్పష్టం చేశారు. పోతిరెడ్డిపాడుపై కుట్రపూరితంగా ప్రజలను మోసం చేసేందుకు యత్నిస్తోందని వెల్లడించారు.
'ప్రభుత్వ చర్యతో తెలంగాణ జిల్లాలు ఎడారిగా మారబోతున్నాయి' - పోతిరెడ్డిపాడుపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం
ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వ చర్యలతో తెలంగాణ జిల్లాలు ఎడారిగా మారబోతున్నాయని పేర్కొన్నారు.

'ప్రభుత్వ చర్యతో తెలంగాణ జిల్లాలు ఎడారిగా మారబోతున్నాయి'
Last Updated : May 19, 2020, 4:50 PM IST