రాష్ట్రానికి గుండెకాయ లాంటి హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం ప్రతి ఒక్కరు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని పార్టీ శ్రేణులకు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఎంపీ రేవంత్ రెడ్డిలు పిలుపునిచ్చారు. ఇందిరాభవన్‌లో ఇవాళ సాయంత్రం మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గంలోని పార్టీ డివిజన్ అధ్యక్షులతో జరిగిన సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాస్ కృష్ణన్, చిన్నారెడ్డి, వర్కింగ్ ప్రసిడెంట్ కుసుమ కుమార్, డీసీసీ అధ్యక్షులు కూన శ్రీశైలం గౌడ్, చల్ల నర్సింహారెడ్డి, మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి తదితరులు హాజరయ్యారు.
జీహెచ్‌ఎంసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో డివిజన్ల వారీగా పార్టీ స్థితిగతులపై సమీక్షించారు. ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా జీహెచ్‌ఎంసీ ఎన్నికల రంగంలోకి దిగాలని పార్టీ నేతలకు, కార్యకర్తలకు ఉత్తమ్, రేవంత్‌లు పిలుపునిచ్చారు. జీహెచ్‌ఎంసీలో విజయమే లక్ష్యంగా పని చేయాలని, అందుకు పార్టీ ఇంఛార్జీలదే కీలకమని వారు స్పష్టం చేశారు.