తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఇది చాలా హేయమైన చర్య... సీఎం ఎక్కడున్నారు?' - సచివాలయం కూల్చివేతపై ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం

పోలీసుల బందోబస్తు నడుమ సచివాలయం భవనాలను కూల్చివేయడమనేది దుర్మార్గమైన చర్య అంటూ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వైఫల్యం వల్లే రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది అంటూ వ్యాఖ్యానించారు.

pcc-chief-uttam-kumar-reddy-on-telangana-seriterite-demolition
'ఇది చాలా హేయమైన చర్య... సీఎం ఎక్కడున్నారు?'

By

Published : Jul 7, 2020, 1:40 PM IST

Updated : Jul 7, 2020, 2:34 PM IST

సచివాలయం పాత భవనాలను కూల్చివేతపై పీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. ఈ చర్య చాలా బాధ కలిగించిందన్నారు. పోలీసుల బందోబస్తు నడుమ సచివాలయం భవనాలను కూల్చివేత అనేది చాలా దుర్మార్గమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశమంతా కరోనాపై దృష్టి పెడుతుంటే ఇక్కడ సచివాలయ భవనాలు కూల్చివేస్తున్నారని... ఇది సరైంది కాదని వ్యాఖ్యానించారు.

ప్రభుత్వం వైఫల్యం వల్లే రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోందని ఉత్తమ్ విమర్శించారు. హైదరాబాద్​లో కరోనా విజృంభిస్తుంటే సీఎం ఎక్కడికి వెళ్లారంటూ ప్రజలు అడుగుతున్నారని తెలిపారు. పెద్ద సంఖ్యంలో కరోనా పరీక్షలు చేయాలని కోరుతున్నాం కానీ... ప్రభుత్వం మా మాటలను పెడచెవిన పెట్టిందంటూ వ్యాఖ్యానించారు. పాజిటివ్ కేసులు, మరణాలను ప్రభుత్వం తక్కువ సంఖ్యగా చూపుతోందన్నారు. ఆరోగ్య శ్రీలో కరోనాను చేర్చకపోతే ఉద్యమిస్తామని ఉత్తమ్ హెచ్చరించారు.

'ఇది చాలా హేయమైన చర్య... సీఎం ఎక్కడున్నారు?'

ఇవీ చూడండి:కొనసాగుతున్న సచివాలయ భవనాల కూల్చివేత

Last Updated : Jul 7, 2020, 2:34 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details