తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రార్థనా మందిరాలను కూల్చివేయడంపై ఉత్తమ్​ అగ్రహం

సచివాలయ ప్రాంగణంలోని ప్రార్థనా మందిరాలను కూల్చివేయడంపై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలస్యంగా స్పందించారని విమర్శించారు.

pcc chief uttam kumar reddy on secretariat demolished in hyderabad
ప్రార్థనా మందిరాలను కూల్చివేయడంపై ఉత్తమ్​ అగ్రహం

By

Published : Jul 10, 2020, 8:23 PM IST

హైదరాబాద్​లోని సచివాలయం కూల్చివేత తుగ్లక్ చర్యగా అభివర్ణించారు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. సచివాలయ ప్రాంగణంలోని ప్రార్థనా మందిరాలను కూల్చివేయడంపై అగ్రహం వ్యక్తం చేశారు. రెండు మసీదులు, ఒక ఆలయానికి జరిగిన నష్టంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన ప్రకటనను తప్పు బట్టారు. అక్కడి దేవాలయాలను సచివాలయ ఉద్యోగులు చాలా పవిత్రంగా భావిస్తారని చెప్పారు.

వారసత్వ నిర్మాణాలు, ప్రార్థనా స్థలాలను రక్షించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదన్నారు. ఒకే స్థలంలో ఆలయం, మసీదు నిర్మాణానికి ముఖ్యమంత్రి ఏలాంటి హామీ ఇవ్వలేదన్నారు. కూల్చివేతలకు ముందు ఆలయం, మసీదు మత పెద్దలను ఎందుకు సంప్రదించలేదని ప్రశ్నించారు.

ఇదీ చూడండి :సీఐ ఇంట్లో రూ.3 కోట్ల ఆస్తులు.. కూపీ లాగుతున్న అనిశా

ABOUT THE AUTHOR

...view details