ఎమ్మెల్సీ ఎన్నికలల్లో అధికార పార్టీ దిగజారి ప్రవర్తిస్తోందని పీసీసీ అధ్యక్షుడు కుమార్ రెడ్డి విమర్శించారు. తెరాసకు ఓటు వేయాలని ఓటర్లను బెదిరించి.. ప్రమాణం చేయించుకుంటున్నారని ఆరోపించారు. ప్రమాణాలు చేయిస్తున్న వీడియోలతో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. దీనిపై తక్షణం స్పందించాలని.. లేకుంటే ఎన్నికల సంఘం కూడా అధికార పార్టీతో కుమ్మక్కైందని భావించాల్సి వస్తుందన్నారు.
ఉపాధ్యాయుల సంఘాలను మంత్రులు పిలిచి బెదిరిస్తున్నారని ఆరోపించారు. పట్టభద్రులు, ఉద్యోగుల సమస్యలపై తాము పోరాడతామని చెప్పారు. ఏడేళ్లలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ కూడా ఎందుకు రాలేదో ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అడ్వొకేట్ దంపతులు వామన్ రావు, నాగమణి హత్యలను కేసీఆర్ ఖండించలేదన్నారు.