Revanth reddy tweet: హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై రేవంత్ ట్వీట్.. కేటీఆర్‌కు ట్యాగ్ - telangana latest news
![Revanth reddy tweet: హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై రేవంత్ ట్వీట్.. కేటీఆర్‌కు ట్యాగ్ pcc-chief-revanth-reddy-tweet-on-illegal-constructions-at-uppal-of-hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13384165-642-13384165-1634534947144.jpg)
09:36 October 18
అక్రమ నిర్మాణాలపై రేవంత్ ట్వీట్.. కేటీఆర్‌కు ట్యాగ్
హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ట్వీట్ చేశారు. హైదరాబాద్ మంత్రి అండతో ఉప్పల్‌లో చౌరస్తాలో అనుమతి లేని చోట అక్రమ నిర్మాణాలు చేస్తున్నారంటూ.. ట్వీట్ చేసిన రేవంత్.. దాన్ని కేటీఆర్‌కు ట్యాగ్ చేశారు. ఈ అక్రమ నిర్మాణంపై ఎన్ని ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోలేదన్నారు. ఈ అక్రమ నిర్మాణాలపై శాఖపరమైన చర్యలుంటాయా.. లేదా అందులో మీరు భాగ్యస్వాములేనా... అంటూ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ను రేవంత్ ప్రశ్నించారు. ఈ ట్వీట్‌ను తెలంగాణ సీఎంవో, జీహెచ్ఎంసీ కమిషనర్ ట్విట్టర్ ఖాతాకు ట్యాగ్ చేశారు.
ఇదీచూడండి:Huzurabad by poll 2021: ప్రచార పర్వంలో ఈటల దంపతులు వర్సెస్ తెరాస మంత్రులు