Revanth reddy: రాష్ట్ర మంత్రి హత్యకు కుట్ర జరిగితే సీఎం సమీక్ష చేయరా.. అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై ఎలక్షన్ అఫిడవిట్ వ్యవహారం విచారణలో ఉండగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. కేసు విచారణలో ఉండగా పోలీసులు మీడియా ముందుకొచ్చి ఎలా మాట్లాడుతారని నిలదీశారు. డీజీపీ సెలవుపై వెళ్లినప్పుడే ఇలాంటిదేదో జరుగుతుందని ముందే చెప్పానని రేవంత్ రెడ్డి అన్నారు. డీకే అరుణ, జితేందర్‌రెడ్డి ఇళ్లపై దాడులు ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మంత్రిపై హత్య కుట్రలో నిజానిజాలు బయటికి రావాలంటే సమగ్ర జుడిషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్ గాంధీభవన్‌లో కిసాన్ కాంగ్రెస్ సమావేశం జరిగింది. రేవంత్‌రెడ్డి, చిన్నారెడ్డి, షబ్బీర్ అలీ, అంజన్‌కుమార్ పాల్గొన్నారు. ఈ భేటీలో పంటల కొనుగోలు, పంటలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆంక్షలు, ధరణి సమస్యలు, రైతుల కష్టాలు, రుణమాఫీపై చర్చించినట్లు రేవంత్‌రెడ్డి చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అవగాహన రాహిత్యం వల్ల.. రాష్ట్రంలో వరి కొనుగోళ్లలో గందరగోళం తలెత్తిందని ఆరోపించారు. ముందస్తు ఏర్పాట్లు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం వల్లనే రైతుల ఆత్మహత్యలు జరిగాయని అన్నారు. రైతులను.. మిల్లర్లు ఇప్పుడే బ్లాక్ మెయిల్ చేస్తున్నారని చెప్పారు. ఈనెల 5న సివిల్ సప్లై కమిషనర్‌ను కలిసి వినతి పత్రం ఇస్తామని చెప్పారు. యాసంగి వడ్ల కొనుగోళ్లలో తగిన చర్యలు తీసుకోవాలని కోరుతామన్నారు.
నాడు టికాయత్ ఎందుకు గుర్తుకురాలేదు..