ప్రధానంగా 30 సంవత్సరాల రాజకీయ పరిణామాలను గమనిస్తే... పలు సందర్భాల్లో కాంగ్రెస్ ఓటమి పాలైంది. అప్పుడు పలువురు.. కాంగ్రెస్ పని అయిపోయిందన్నారు. కానీ 2004లో దాదాపు 250సీట్లతో గెలిచి తిరిగి అధికారంలోకి వచ్చింది. 2014 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉంది. 1994 నుంచి 2004 వరకు తెదేపా, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్, 2014 నుంచి 2024 వరకు తెరాస అధికారంలో ఉంది. పది సంవత్సరాలు ఒక్కొక్క పార్టీకి అవకాశమిచ్చారు. తెరాసకు తెలంగాణలో కాలం చెల్లిపోయింది.
కేసీఆర్ ఎంత చెప్పుకున్నా.. తెలంగాణ ఉద్యమం చేసినా, తెలంగాణ కోసం కొట్లాడినా, రాష్ట్రం కోసం చావు నోట్లో తలకాయ పెట్టిన అని ఎన్నిసార్లు చెప్పుకున్నా... కేసీఆర్ చేసిన శ్రమ కంటే, త్యాగం కంటే ప్రజలు చాలా ఎక్కువిచ్చారు. తెలంగాణ ప్రజలను ఆయన స్వేచ్ఛ లేకుండా నిర్బంధించారు. ఆయన నుంచి తెలంగాణ సమాజం విముక్తి కోరుకుంటోంది. ఇక ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉంది. కేసీఆర్కు మేమే ప్రత్యామ్నాయం. తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ నాయకులు వీరోచితంగా పోరాటం చేశారు. తెలంగాణ తెచ్చిన కాంగ్రెస్ నేతలు ఎయిర్ పోర్టులో దిగి ఇంటికిపోతే... కేసీఆర్ హంగామా చేసి తానే సాధించినట్లు హడావుడి చేశారు.
Revanth Reddy: కేసీఆర్కు ప్రజలు ఎక్కువే ఇచ్చారు - రేవంత్ రెడ్డి వార్తలు
తెరాస పనైపోయిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) అన్నారు. కేసీఆర్ ఎంత చెప్పుకున్నా.. తెలంగాణ ఉద్యమం చేసినా, తెలంగాణ కోసం కొట్లాడినా, రాష్ట్రం కోసం చావు నోట్లో తలకాయ పెట్టిన అని ఎన్నిసార్లు చెప్పుకున్నా... కేసీఆర్ చేసిన శ్రమ కంటే, త్యాగం కంటే ప్రజలు చాలా ఎక్కువే ఇచ్చారని చెప్పారు.
రేవంత్ రెడ్డి, పీసీసీ
-రేవంత్ రెడ్డి(Revanth Reddy), పీసీసీ అధ్యక్షుడు