తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏది ఏమైనా.. మే 7న చంచల్​గూడ జైలుకు రాహుల్ గాంధీ: రేవంత్​రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వ తీరుపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి విరుచుకుపడ్డారు. ఏది ఏమైనా.. మే 7న రాహుల్​ గాంధీ చంచల్​గూడ జైలుకు వస్తారని అన్నారు. జైలులో ఉన్న విద్యార్థులను కలవడానికి రాహుల్​ గాంధీకి అనుమతి ఇవ్వాలని జైళ్ల శాఖ డీజీ జితేందర్​ను కలిసినట్లు వివరించారు.

pcc chief revanth reddy fires on trs government
ఇది నిరంకుశ పాలన.. అధికారం శాశ్వతం కాదు: రేవంత్​రెడ్డి

By

Published : May 5, 2022, 5:02 PM IST

Updated : May 5, 2022, 6:19 PM IST

ఏది ఏమైనా.. మే 7న చంచల్​గూడ జైలుకు రాహుల్ గాంధీ: రేవంత్​రెడ్డి

revanth reddy on rahul tour: ఎన్​ఎస్​యూఐ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేసి జైలుకు పంపించారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి ఆరోపించారు. చంచల్ గూడ జైలులో ఉన్న విద్యార్థులను కలవడానికి రాహుల్​ గాంధీకి అనుమతి ఇవ్వాలని జైళ్ల శాఖ డీజీ జితేందర్​ను కలిసి విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ నేతలు గీతారెడ్డి, జగ్గారెడ్డి, సంపత్​కుమార్​తో కలిసి డీజీపీ కార్యాలయానికి వెళ్లారు. కాంగ్రెస్ నేతల వినతిపై ఆలోచించి నిర్ణయం చెబుతామని జైళ్ల శాఖ డీజీ తెలిపారు.

అనుమతి ఉన్నా... లేకపోయినా రాహుల్ గాంధీ చంచల్ గూడ జైళ్లో ఉన్న ఎన్ఎస్​యూఐ కార్యకర్తలను పరామర్శించి తీరుతారని రేవంత్ రెడ్డి అన్నారు. ఇందుకోసమే జైలు సూపరింటెండెంట్​ అనుమతి కోసం దరఖాస్తు పెట్టుకున్నట్లు తెలిపారు. ఎలాంటి ఖైదీలనైనా కలిసే హక్కు ఎవరికైనా ఉంటుందని పేర్కొన్నారు. 18 మంది ఎన్​ఎస్​యూఐ విద్యార్థులు జైళ్లో ఉన్నట్లు తెలిపారు. అధికారులపై నాయకులు ఒత్తిడి తెస్తున్నారని రేవంత్​రెడ్డి ఆరోపించారు.

దేశ స్వాతంత్య్ర చరిత్రలో ఎన్నడూ లేనంత నిరంకుశంగా కేసీఆర్ పాలిస్తున్నాడని... కాంగ్రెస్ ఇలాగే పాలించి ఉంటే... ప్రత్యేక రాష్ట్రం రాకపోయేదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రైతులు, నిరుద్యోగుల కోసమే రాహుల్ తెలంగాణలో పర్యటిస్తున్నారని... వరంగల్​లో సభ తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థుల ముఖాముఖికి ప్రభుత్వం ఎందుకు అనుమతి ఇవ్వలేదని రేవంత్ ప్రశ్నించారు. నిరుద్యోగుల విజ్ఞప్తి మేరకే రాహుల్, ఓయూకు వెళ్లడానికి అంగీకరించారని.... ప్రభుత్వం మాత్రం అధికారులు, పోలీసుల అండతో అడ్డుకుంటోందని రేవంత్ ఆరోపించారు. ప్రజా స్వామ్య బద్దంగా అనుమతి కోరుతున్నట్లు వెల్లడించారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు.

'జైలులో ఉన్న విద్యార్థులను కలవడానికి రాహుల్​ గాంధీకి అనుమతి ఇవ్వాలని జైళ్ల శాఖ డీజీని కలిశాం. ఆయన ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అక్కడిక్కడే నిర్ణయం తీసుకోకుండా.. పరిశీలిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉంది. ప్రభుత్వం అధికారులపై ఒత్తిడి తెస్తోంది. అధికారం శాశ్వతం కాదు. ఇది నిరంకుశ పాలన. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తోంది.'

- రేవంత్​రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

ఇవీ చదవండి:

Last Updated : May 5, 2022, 6:19 PM IST

ABOUT THE AUTHOR

...view details