కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఈడీ కార్యాలయంలో అర్ధరాత్రి వరకు కూర్చోబెట్టారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... తాము నిరసన తెలిపితే పోలీసులతో దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. కేంద్రం, ఈడీ తీరుకు నిరసనగా రేపు రాజ్‌భవన్ ముందు ధర్నా చేస్తామని తెలిపారు. ఖైరతాబాద్ నుంచి రాజ్‌భవన్ వరకు ర్యాలీ ఉంటుందని, రేపటి ర్యాలీకి కాంగ్రెస్ శ్రేణులు తరలి రావాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో భాజపాకు కేసీఆర్ పరోక్షంగా సహకరిస్తారని ఆరోపించారు. రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండి భాజపాకు సాయం చేస్తారని పేర్కొన్నారు. కలిసి పనిచేద్దామన్న కేసీఆర్.. మమతా బెనర్జీ నిర్వహించిన సమావేశానికి ఎందుకు వెళ్లలేదని నిలదీశారు. భాజపాకు కేసీఆర్ వ్యతిరేకమైతే రాష్ట్రపతి అభ్యర్థిని నిలబెడతారా? అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.