తెలంగాణ

telangana

ETV Bharat / state

Revanth Reddy Comments: 'ఆఖరి గింజ కొనే దాకా కొట్లాడుతాం'

వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాటకాలడుతున్నాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy Comments) ఆరోపించారు. రైతులపై కక్ష సాధింపు చర్యలు ఆపాలన్నారు.

Revanth Reddy
Revanth Reddy

By

Published : Nov 28, 2021, 4:53 AM IST

రాష్ట్రంలో వరిధాన్యం ఆఖరి గింజ కొనేదాకా రైతుల పక్షాన కొట్లాడతామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి (Revanth Reddy Comments) స్పష్టం చేశారు. పార్లమెంటులో కేంద్రాన్ని నిలదీస్తామని... అవసరమైతే దిల్లీ జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నా చేస్తామని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వడ్ల కొనుగోలులో నాటకాలాడుతున్నాయని విమర్శించిన రేవంత్‌... కేసీఆర్ (KCR) రైతులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

60 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలుకు కేంద్రం ముందుకొచ్చినా రాష్ట్రం ధాన్యం సేకరించడం లేదని మండిపడ్డారు. రైతులు కల్లాల్లోనే కన్నుమూస్తుంటే భాజపా నేతలు రాజకీయాలు మాట్లాడటం వారి దివాలా కోరుతనంగా అంటున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి.

'ఆఖరి గింజ కొనే దాకా కొట్లాడుతాం'

ఇదీ చూడండి: Revanth in Vari Deeksha: 'వరి కొనకపోతే.. నడిబజార్ల ఉరి తీయటం ఖాయం'

ABOUT THE AUTHOR

...view details