తెలంగాణ

telangana

ETV Bharat / state

ఒకరు పార్టీని వీడి.. మరొకరు పార్టీలోనే ఉంటూ వెన్నుపోటు: రేవంత్‌ - Revanth reddy fires on trs

ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి, రేవంత్‌రెడ్డిల మధ్య కోల్డ్ వార్ నడుస్తుందనే విషయం తెలిసిందే. మరోసారి కోమటిరెడ్డి బ్రదర్స్‌పై రేవంత్‌రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఒకరు పార్టీ వీడి.. మరొకరు పార్టీలోనే ఉంటూ... వెన్నుపోటు పోడుస్తున్నారని ఆరోపించారు.

revanth fires on komati brothers
revanth fires on komati brothers

By

Published : Oct 26, 2022, 5:55 PM IST

కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య విభేదాలు ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఒకరిపై మరొకరు ఎప్పుడూ ఆరోపణలు చేసుకుంటూ... వార్తల్లో నిలుస్తున్నారు. అయితే తాజాగా మరోసారి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కోమటిరెడ్డి బ్రదర్స్‌పై విరుచుకుపడ్డారు. ఒకరు పార్టీని వీడి కాంగ్రెస్‌కు నష్టం చేస్తే... మరొకరు పార్టీలోనే ఉంటూ.. ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు.

ఎన్నికల సర్వే నిర్వహిస్తే... రాజగోపాల్‌రెడ్డి మూడో స్థానంలో ఉన్నారని.. అందుకే చలి జ్వరం వచ్చి పడుకున్నారని ఎద్దేవా చేశారు. తెరాస, భాజపాలకు ఉమ్మడి శత్రువు కాంగ్రెస్... వారి కుట్రలను ఎదుర్కొవాలని పార్టీ శ్రేణులకు సూచించారు. వారి కుట్రలను తిప్పి కొట్టే బాధ్యత కాంగ్రెస్ శ్రేణులపై ఉందని పేర్కొన్నారు.

అయితే కాంగ్రెస్ పార్టీలో ఈ కోల్డ్ వార్ గత కొంతకాలంగా జరుగుతున్నదే. రేవంత్ రెడ్డి కోమటి రెడ్డి బ్రదర్స్‌పై చాలా సందర్భాల్లో ఆరోపణలు చేశారు. మొన్న కోమటిరెడ్డి బ్రదర్స్ బ్రాందీ షాపులు పెట్టుకునే వాళ్లంటూ రేవంత్ వ్యాఖ్యలు దుమారం లేపాయి. దీనిపై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫైర్ అయ్యారు. వెంటనే రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details