తెలంగాణ

telangana

ETV Bharat / state

‘హుస్సేన్​సాగర్‌’ జలం.. తగ్గుతున్న కాలుష్యం! - telangana pollution control board tested hussain sagar water

ఏప్రిల్​లో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి హుస్సేన్​సాగర్​ నీటి నమూనాలను పరీక్షించారు. జనవరితో పోలిస్తే సాగర్​లో కాలుష్యం తగ్గుతున్నట్లు వెల్లడైంది. మరింత సమగ్ర అధ్యయన చేసేందుకు ఆర్థికంగా తాము సహకరించనున్నట్లు బల్క్​డ్రగ్ మ్యానుఫ్యాక్చర్స్​ అసోసియేషన్​ తెలిపింది.

pcb declared water pollution decreased in hussain sagar
‘హుస్సేన్​సాగర్‌’ జలం.. తగ్గుతున్న కాలుష్యం!

By

Published : May 13, 2020, 10:08 AM IST

హుస్సేన్‌ సాగర్‌లో కాలుష్యం తగ్గుముఖం పడుతున్నట్లు తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి(టీఎస్‌పీసీబీ) పరీక్షల్లో వెల్లడైంది. ఏప్రిల్‌లో హుస్సేన్‌ సాగర్‌ నుంచి నమూనాలను సేకరించి సనత్‌ నగర్‌లోని ప్రధాన ప్రయోగశాలలో నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించారు. లీటర్‌ నీటిలో డీవో పరిమాణం 6 ఎంజీలు, బీవోడీ 20 ఎంజీలు, పీహెచ్‌ విలువ 7.7, టోటల్‌ కోలిఫాం 100 ఎంఎల్‌ నీటిలో 920 ఎంపీఎన్‌ ఉన్నట్లు తేలింది. ఇదే గణాంకాలు జనవరిలో డీవో 1 ఎంజీ, బీవోడీ 26 ఎంజీలు, పీహెచ్‌ 8.16, టోటల్‌ కోలిఫాం 1600 ఎంపీఎన్‌గా ఉన్నాయి.

మెరుగుపడిన నాణ్యత

ఈ ప్రకారం జనవరితో పోలిస్తే ఏప్రిల్‌లో నీటి నాణ్యత మెరుగుపడింది. మరింత సమగ్ర అధ్యయనం కోసం అయ్యే వ్యయాన్ని భరించేందుకు మేం సిద్ధంగా ఉన్నామని బల్క్‌డ్రగ్‌ మ్యానుఫ్యాక్చర్స్‌ అసోసియేషన్‌(ఇండియా) ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పి.ఈశ్వర్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఇదీ చూడండి:కరోనాను అడ్డుపెట్టుకొని 9వేల సైబర్​ దాడులు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details