తెలంగాణ

telangana

ETV Bharat / state

"వాయు కాలుష్య నియంత్రణ.. అందరి బాధ్యత"

వాయు కాలుష్యాన్ని నిర్మూలించేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి డైరెక్టర్ అనిల్ కుమార్ పిలుపు నిచ్చారు.

By

Published : Aug 29, 2019, 8:15 PM IST

'వాయు కాలుష్య నియంత్రణ మనందరి బాధ్యత'

'వాయు కాలుష్య నియంత్రణ మనందరి బాధ్యత'

వాయు కాలుష్యాన్ని నిర్మూలించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో సనత్ నగర్​లో ఆటో డ్రైవర్ల అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. అనంతరం ఆటో ర్యాలీని ప్రారంభించారు. ఈ సదస్సుకు సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్, ఏసీపీ బాపురెడ్డి, మేడ్చల్ ఆర్టీఓ ప్రతాప్ రాజా హాజరయ్యారు. దేశంలో వాయు కాలుష్యం ఎక్కువైందని, వాయు కాలుష్యాన్ని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరు తమ వంతు కృషి చేయాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి బోర్డ్ డైరెక్టర్ అనిల్ కుమార్ కోరారు. ముఖ్యంగా ఆటో డ్రైవర్లు తమ వాహనాల నుంచి వచ్చే కాలుష్యాన్ని నివారించాలని కోరారు. పర్యావరణ పరిరక్షణ కొరకు ప్రజలు సహకరించి కాలుష్య నియంత్రణకు పాటుపడాలని పిలుపు నిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details