Girl child protection scheme: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోఆడపిల్లల తల్లిదండ్రులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు అమలు చేస్తున్న బాలికా సంరక్షణ పథకానికి తూట్లు పడుతున్నాయి. నాలుగేళ్లుగా బీమా సంస్థకు ప్రీమియం చెల్లింపు నిలిచిపోయింది. దీంతో 55 వేల మందికి ఆర్థిక సాయం ఆగిపోయింది. వైసీపీ అధికారం చేపట్టాక ఒక్కరికీ సాయం అందలేదు. ఈ పథకంలో భాగంగా ప్రభుత్వం ఇచ్చిన బాండ్లు తీసుకుని లబ్ధిదారులు కాళ్లరిగేలా ఐసీడీఎస్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. భ్రూణ హత్యలను నిరోధించేందుకు, బాలికా విద్యను ప్రోత్సహించేందుకు వీలుగా తీసుకొచ్చిన ఈ పథకం కింద ఆడపిల్లలున్న కుటుంబానికి ఆర్థిక సాయాన్ని అందిస్తారు. 4 లక్షల మంది సభ్యులుగా నమోదయ్యారు. కుటుంబంలో ఒక కుమార్తె ఉంటే ఆమెకు 20 ఏళ్ళు నిండిన వెంటనే లక్ష రూపాయలు చెల్లిస్తారు. ఇద్దరూ అమ్మాయిలుంటే నిర్ణీత గడువు తర్వాత ఒక్కొక్కరికీ 30 వేల చొప్పున అందిస్తారు. ప్రీమియం చెల్లింపుపై ప్రభుత్వానికి నివేదించామని, ఆర్థిక సాయం విడుదలపై ఎల్ఐసీతోనూ చర్చిస్తున్నామని మహిళా శిశు సంక్షేమశాఖ అధికారులు చెప్పుకొస్తున్నారు.
బాలికా సంరక్షణ పథకానికి వైసీపీ ప్రభుత్వం తూట్లు - welfare schemes in ap
Girl child protection scheme: ఏపీలో బాలికా సంరక్షణ పథకానికి తూట్లు పడుతున్నాయి. ఆడపిల్లల తల్లిదండ్రులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం దీనిని తీసుకురాగా నాలుగేళ్లుగా.. 55 వేల మందికి సాయం నిలిచిపోయింది. లబ్ధిదారులు కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
బాలికా సంరక్షణ పథకానికి వైసీపీ ప్రభుత్వం తూట్లు