తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈనెల 11న పేమెంట్ సీట్ల భర్తీ కౌన్సిలింగ్  ప్రారంభం - horti culture

హైదరాబాద్ జయశంకర్ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ అగ్రికల్చర్, కొండా లక్ష్మణ్ బాపూజీ యూనివర్సిటీలో బీఎస్సీ హార్టీకల్చర్ పేమెంట్ సీట్ల భర్తీకి సంబంధించిన కౌన్సిలింగ్ ఈ నెల11న జరగనుంది.

ఈనెల 11న పేమెంట్ సీట్ల భర్తీ కౌన్సిలింగ్  ప్రారంభం

By

Published : Sep 7, 2019, 12:53 PM IST

జయశంకర్ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ అగ్రికల్చర్, కొండా లక్మణ్ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయంలో బీఎస్సీ హార్టీ కల్చర్ కోర్సుల్లో పేమెంట్ సీట్ల భర్తీకి సంబంధించి ఈనెల 11న కౌన్సిలింగ్ జరగనుంది. ఆ విశ్వవిద్యాలయాల్లోని ఆడిటోరియాల్లో ఈ కౌన్సిలింగ్​ను నిర్వహించనున్నారు. తెలంగాణ ఎంసెట్ - 2019లో ర్యాంకు పొంది ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో... 13,999 లోపు ర్యాంకు పొందిన విద్యార్థులంతా కౌన్సిలింగ్‌కు హాజరుకావడానికి అర్హులు. కౌన్సిలింగ్‌ హాజరయ్యే అభ్యర్థులు 10,13,550 రూపాయలు డిమాండ్ డ్రాఫ్ట్... కంప్ట్రోలర్, పీజేటీఎస్‌ఏయూ పేరిట తీసుకుని రావాల్సి ఉంటుంది. సీటు లభించిన వెంటనే ఆ డీడీతో పాటు 36,450 రూపాయల ఫీజు కూడా చెల్లించాలని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్‌.సుధీర్‌కుమార్ అన్నారు. సీట్ల వివరాలు, ర్యాంకుల వివరాలు, ఇతర సంబంధిత సమగ్ర సమాచారం కోసం విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌ www.pjtsau.edu.inలో చూడవచ్చు.

ఈనెల 11న పేమెంట్ సీట్ల భర్తీ కౌన్సిలింగ్ ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details