తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఇలాంటి జీవో అప్పుడు ఇచ్చి ఉంటే.. జగన్​రెడ్డి పాదయాత్రలు చేసేవారా' - janasena latest news

Pawan Kalyan: ఏపీలోని వైసీపీ ప్రభుత్వం జీవో1 పేరుతో ఆంక్షలు విధించటంపై జనసేన అధినేత పవన్​కల్యాణ్​ స్పందించారు. ఆంక్షల పేరుతో చంద్రబాబు కుప్పం పర్యటనను అడ్డుకున్నారని మండిపడ్డారు. జగన్​ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాంటి ఆంక్షలు ఉంటే పాదయాత్ర కొనసాగేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Pawan Kalyan
జనసేన అధినేత పవన్​కల్యాణ్​

By

Published : Jan 4, 2023, 11:00 PM IST

Pawan Kalyan: ప్రతిపక్షాల గొంతు వినిపించకూడదు.. ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించకూడదనే ఉద్దేశ్యంతోనే.. ఏపీ ప్రభుత్వం జీవో 1ని తీసుకొచ్చారని జనసేన అధినేత పవన్​ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి జీవో గతంలో ఉంటే.. నాడు జగన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్ర చేసేవారా అని ప్రశ్నించారు. చంద్రబాబు సొంత నియోజకవర్గంలో పర్యటించటం ఆయన విధి.. దానిని జీవోల పేరిట అడ్డుకుంటారా అని నిలదీశారు.

జీవోల పేరు చెప్పి చంద్రబాబు కుప్పం పర్యటన చేయకుండా అడ్డుకున్నారని విమర్శించారు. ఇవే జీవోల ఆంక్షలు జగన్​రెడ్డికి వర్తించవా అని ప్రశ్నించారు. రాజమహేంద్రవరంలో జగన్​ పర్యటన జీవో ఉల్లంఘన కిందకు వస్తుందో, రాదో పోలీసులు వివరణ ఇవ్వాలని అన్నారు. ముఖ్యమంత్రి ప్రజా వ్యతిరేక విధానాలు చేస్తుంటే ప్రశ్నించటం ప్రతిపక్షంగా మా బాధ్యత అని పవన్​ అన్నారు. చీకటి ఉత్వర్వులు ఇవ్వకుండానే గతంలో.. ఇందులోని దురుద్దేశాలను చూపించారని విమర్శించారు. విశాఖ నగరంలో హోటల్​ నుంచి బయటకు రాకూడదని.. ప్రజలకు అభివాదం చేయకూడదని నిర్బంధాలు విధించారని దుయ్యబట్టారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details