ఆక్సిజన్ అందక కరోనా రోగులు ప్రాణాలు కోల్పోవటం విషాదకరమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఏపీలోని తిరుపతి రుయా ఘటన.. తీవ్ర ఆవేదనకు గురి చేసిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉందని అందరూ చెబుతున్నారని.. కర్నూలు, హిందూపురం ఆసుపత్రుల్లో ఆక్సిజన్ అందక ప్రజలు ప్రాణాలు కోల్పోయిన ఘటనలను గుర్తుచేశారు.
రుయా ఆసుపత్రి ఘటనపై స్పందించిన జనసేన అధినేత - రుయా ఆసుపత్రి ఘటన తాజా వార్తలు
ఏపీలోని తిరుపతి రుయా ఆసుపత్రి ఘటనపై జనసేన అధినేత పవన్ స్పందించారు. ఆక్సిజన్ అందక 11 మంది మృతి చెందటం బాధాకరమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మరెక్కడా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ruya hospital incident
ఇన్ని జరుగుతున్నా ప్రభుత్వం కార్యాచరణ రూపొందిచుకోలేదని పవన్ నిందించారు. విపత్కర సమయంలో విమర్శలు చేయకూడదనే ఉద్దేశంతోనే సంయమనం పాటిస్తున్నాని.. మరెక్కడా ఇటువంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:మూడోదశలో చిన్నారులకు కరోనా ముప్పు